1
స్తోత్రము యేసునాథా - నీకు సదా
స్తోత్రము యేసునాథా
స్తోత్రము చెల్లింతుము - నీదు
దాసులము - పిత్ర పుత్రాత్మలకు
2
నేడు నీదు నామ మం - దున మేము
చేరి స్తుతించునట్లు
చేసిన కృపకై - నీకే నిరతము -
స్తోత్రము చేసెదము
3
నీదు రక్తధారచే - కలిగిన -
సజ్జీవ నవ మార్గము
దాసులము తండ్రి - సన్నిధి
చేరను నిత్యము స్వతంత్రము
4
ఇట్టి ప్రభావమైన - పదవిని
పురుగుల మగు మాకు
ఇంత దయతోడ - నిచ్చిన కృప
మా కెంతయో నాశ్చర్యము
5
దూతల సైన్యములు – శృంగార
గీతముల నెప్పుడు
రాజాధిరాజా నీకు - స్తుతులు
పాడుచు - నార్భటించుచుందురు
6
నీవు తప్ప మాకు - పరమందున
వేరెవ్వరు గలరు
ఇద్ధరయందు - నీవు తప్ప
మాకు ఆదరణ యెవరు

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)