1
ఆయన సముద్రము
మీద దాని పునాది వేసెను
ప్రవాహ జలముల
మీద దాని స్థిర పరచెను ||భూమి||
2
యెహోవా పర్వతమునకు
ఎక్కదగినవాడెవడు?
ఆయన పరిశుద్ధ - స్థలములలో
నిలువదగినవాడెవడు? ||భూమి||
3
వ్యర్థమైన దానియందు
మనస్సు పెట్టకయు
నిర్దోష చేతులు - శుద్ధ హృదయము
కలిగిన వాడే ||భూమి||
4
వాడాశీర్వాదము నీతి
మత్వము నొందును
నిన్నాశ్రయించి - నీ సన్నిధిని
వెదకెడువాడే ||భూమి||
5
గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి
పురాతన తలుపులారా
మహిమగల ఈ రాజు ప్రవేశింప
మిమ్ము లేవనెత్తుకొనుడి ||భూమి||
6
మహిమ గల ఈ రాజెవడు
బల శౌర్యముగల ప్రభువే
యుద్ధ శూరుడైన యెహోవా
ప్రరాక్రమము గల ప్రభువే ||భూమి||
7
మహిమగల ఈ రాజెవడు
సై-న్యముల యెహోవాయే
ఆ..య..నే ఈ మహిమగల రాజు
హల్లెలూయ ఆమెన్‌ ||భూమి||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)