1
ప్రభో - పలుమారు నిన్నునే గొట్టితి
వలదని చెప్పిన - వినక నే జేసితి
పలునిందలు మోపితి - నీ మీద ||యేసు||
2
నీదు - పవిత్ర మోము పైనే నిన్ను
నాదు ఉమ్మివేసి - హద్దు లేక జేసి
నీచపర్చితినయ్యా - నా యేసు ||యేసు||
3
కృప - తో నిండి వచ్చిన నిన్నునే
కాలు చేతులు గట్టి-సీలలతో గొట్టి
మెట్టపై బెట్టితి - నేనిన్ను ||యేసు||
4
ప్రేమ - తో నిండి వచ్చిన నిన్నునే
నాదు చెడు తలంపులతో
నీదు శిరస్సుపైని
ముల్లుల కిరీటము గొట్టితిని ||యేసు||
5
మేళ్ళ - తో నిండి వచ్చిన నిన్నునే
నాదు చెడు నడతలతో నీదు ప్రక్కలోన
బళ్ళెంపు పోటును బొడిచితిని ||యేసు||
6
ఇన్ని - చేసినగాని నన్ను నీవు
చేపట్టి బుజ్జగించితివయ్యా నా తండ్రి
నాకు తెలియకున్నది - నీ ప్రేమ ||యే||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)