1
వేషభాషల తోడ నిండి
మోసపోయితిని యేసయ్యా
దోసిలొగ్గి నిన్ను జేరితి
దాసునిగ బ్రోవు మేసయ్యా ||పాపిని||
2
నీతిలేని నాదు జీవిత
మేల నికనయ్యా యేసయ్యా
నీతి గరపి బ్రోవుమయ్యా
నీతి నిడవయ్యా యేసయ్యా ||పాపిని||
3
నీదు సిలువలోని ప్రేమ
నెంచదరమౌనె యేసయ్యా
నాదు కలుషమంత బాపి
కనికరింపుమా యేసయ్యా ||పాపిని||
4
నీదు రక్తధారలే యిల
పాపికాశ్రయము యేసయ్యా
నీతిమంతుల జేయుమయ్యా
నీతి సూర్యుండా యేసయ్యా ||పాపిని||
5
దాపుగోరిన వారలకు నీ
పాప్రు జూపితివి యేసయ్యా
పాపశాపము బాపి నిత్య
జీవమిడవయ్యా యేసయ్యా ||పాపిని||
6
శాంతి గోరువారలెల్ల నీ
చెంత కరిగినచో యేసయ్యా
చింతలెల్ల దీర్చగలవు
శాంతి నొసగెదవు యేసయ్యా ||పాపిని||
7
పరమ రక్షకా నీదు ప్రేమ
నెరుగ దరమౌనె యేసయ్యా
పరులమైన మమ్ము బ్రోవ
వేచియున్నావా యేసయ్యా ||పాపిని||
8
నాదు హృదయము నీదె సుమ్మా
నీవె గైకొనుమా యేసయ్యా
శుద్ధ హృదయము జేసినను నీ
సుతునిగా జేయు మేసయ్యా ||పాపిని||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)