1
చూడు సమాధిని - మూసిన రాయి
దొరలుచు పొరలిడెను
అందు వేసిన ముద్ర - కావలి నిల్చున
దైవ సుతుని ముందు ఆ..ఆ.. ||గీతం||
2
వలదు వలదు - ఏడువ వలదు
పరుగిడి ప్రచురించుడి
తాను చెప్పిన విధమున - తిరిగి లేచెను
వెళ్ళుడి గలిలయకు ఆ..ఆ.. ||గీతం||
3
అన్న కయప - వారల సభయును
అదరుచు పరుగిడిరి - ఇంకా
దూతగణముల - ధ్వనిని వినుచు
వణకుచు భయపడిరి ఆ..ఆ.. ||గీతం||
4
గుమ్మముల్‌ తెరచి - చక్కగ నడువుడి
జయవీరుడు రాగా - మీ
మేళతాళ - బూర వాయిద్యము
లెత్తి ధ్వనించుడి ఆ..ఆ.. ||గీతం||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)