1
స్వంత జనం మరచినను
మరువడాయన
నీతి సూర్యుడైన తండ్రి
యేసు దేవుడే
పరిస్థితులు మారినను
యేసు నిన్ను మరచిపోడు
సిలువలో ప్రాణం బెట్టె
సమయంలో మరువలేదే
2
పనికిరాని వాడవని త్రోసివేసినా
అబ్రాహాము దేవుడు నిన్ను
త్రోసివేయడు
దిక్కులేని వారినంతా
చేర్చుకొనే రక్షకుడు
జడియకు నా బిడ్డలారా
యంటు ఆదరించు
3
వ్యాధి గలవాడవని నెట్టి వేశారు
సూటి పోటి మాటలతో
గాయపరిచారు
చావనా బ్రతకనాయని నీవేడ్చి
కుమిలిపోతే
బ్రతికే వుండాలని
నీ వ్యాధిని తీసివేసె
4
కష్టపడెటప్పుడు ఎవ్వరు
సాయం చేయరు
అప్పులను తీర్చువారు
అసలే లేరు
ఇష్టమైన దేవతలను
పూజించి చూశాము
మన కష్టాలను తీర్చ అవి
ముందుకు రాలేదు
ఈ లోక దేవతలు అన్నియును
వట్టివండి
యేసుక్రీస్తు ఒక్కడే నిజమైన దేవుడండి
పాపములన్ని బాపి రక్షించే
దేవుడండి

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)