1
నీ రక్తధారలే యిల
పాపి కాశ్రయం బిచ్చును
పరిశుద్ధ తండ్రి పాపిని
కడిగి పావన పర్చుము ||నీరక్తమే||
2
నశించు వారికి నీ సిలువ
వెఱ్ఱితనముగ నున్నది
రక్షింపబడుచున్న పాపికి
దేవుని శక్తియైయున్నది ||నీరక్తమే||
3
నీ సిలువలో కార్చినట్టి
విలువయిన రక్తములోన
పరమపావన కడుగుము
పవిత్ర పరచుము పాపిని ||నీరక్తమే||
4
పందివలె పొర్లిన నన్ను
కుక్కవలె తిరిగిన నన్ను
ప్రేమతో చేర్చుకొంటివి
ప్రేమార్హ నీకె స్తోత్రము ||నీరక్తమే||
5
నన్‌ వెంబడించు సైతానున్‌
నన్‌ బెదరించు సైతానున్‌
దునుమాడేది నీ రక్తమే
దహించేది నీ రక్తమే ||నీరక్తమే||
6
స్తుతి మహిమ ఘనతయు
యుగ యుగంబులకును
స్తుతి పాత్ర నీకే చెల్లును
స్తోత్రార్హ నీకెే తగును ||నీరక్తమే||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)