1
దివారాత్రములు
కంటిపాపవలె కాచి
దయగల హస్తముతో
బ్రోచి నడిపించితివి ||స్తోత్రం||
2
గాఢాంధకారములో
కన్నీటి లోయలలో
కృశించిపోనీయక కృపలతో
బలపరచితివి ||స్తోత్రం||
3
సజీవ యాగముగా
మా శరీరముల్‌ సమర్పించి
సంపూర్ణ సిద్ధినొంద
శుద్ధాత్మను నొసగితివి ||స్తోత్రం||
4
సీయోను మార్గములో
పలుశోధనలు రాగా
సాతాన్ని జయించుటకు
విశ్వాసము నిచ్చితివి ||స్తోత్రం||
5
సిలువను మోసికొని
సువార్తను చేపట్టి
యేసుని వెంబడింప
ఎంత భాగ్యమునిచ్చితివి ||స్తోత్రం||
6
పాడెద హల్లెలూయ
మరనాత హల్లెలూయ
సదపాడెద హల్లెలూయ
ప్రభు యేసుకె హల్లెలూయ||స్తోత్రం||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)