1
లోకాన శాశ్వతానంద మేమియు
లేదని చెప్పెను ప్రియుడేసు
పొందవలె నీ లోకమునందు
కొంతకాల మెన్నో శ్రమలు ||సీయో||
2
ఐగుప్తును విడిచినట్టి మీరు
అరణ్య వాసులె ఈ ధరలో
నిత్య నివాసములే దిలలోన
నేత్రాలు కానాను పై నిల్పుడి ||సీయో||
3
మారాను పోలిన చేదైన స్థలముల
ద్వారా పోవలసియున్ననేమి
నీ రక్షకుండగు యేసే నడుపును
మారని తనదు మాట నమ్ము ||సీయో||
4
ఐగుప్తు ఆశలన్నియు విడిచి
రంగుగ యేసుని వెంబడించి
పాడైన కోరహు పాపంబు మాని
విధేయులై విరాజిల్లుడి ||సీయో||
5
ఆనందమయ పరలోకంబు మనది
అక్కడనుండి వచ్చు నేసు
సీయోనుగీతము సొంపుగ గలిసి
పాడెదము ప్రభు యేసునకు ||సీయో||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)