1
మోషే ప్రార్థించగా
మన్నాను కురిపించితివి
యెహోషువ ప్రార్థించగా
సూర్యచంద్రులనాపితివి ||యెహో||
2
నీ ప్రజల పక్షముగా
యుద్ధములు చేసిన దేవా
అగ్నిలో పడవేసినా
భయమేమి లేకుండిరి ||యెహో||
3
పేతురును బంధించినా
చెఱసాలలో వేసినా
సంఘము ప్రార్థించగా
సంకెళ్లువిడిపోయెను ||యెహో||
4
సింహాల బోనులకైనా
సంతోషముగా వెళ్లిరి
ప్రార్థించినా వెంటనే
రక్షించే నీ హస్తము ||యెహో||
5
చెఱసాలలో వేసినా
సంకెళ్లు బిగియించినా
పాటలతో ప్రార్థించగా
చెఱసాల బ్రద్ధలాయె ||యెహో||
6
మానవుల రక్షణ కొరకై
నీ ప్రియ కుమారుని
లోకమునకు పంపగా
ప్రకటించే నీ వాక్యము ||యెహో||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)