1
ఒక్క తలాంతో రెండు ఉన్నవో
ఐదు ఉన్నను వాడినవారు
చిన్న పనిలో పెద్ద పనిలో
ఇచ్చినట్టి పనిని చేసినవారు ||దేవ||
2
అడవులలో పయనించి
ప్రభుని ప్రేమ పంచినవారు
కలిమిలోను లేమిలోను
పట్టుదలగా ప్రార్థించువారు ||దేవ||
3
ఒంటరితనం పేదరికంలో
లాజరులా నిలబడిరి
యాచించిన పోషించిన
విశ్వాసము వీడనివారు ||దేవ||
4
జాతులన్నియు గోత్రాలన్నియు
భాషలన్నియు మాట్లాడువారు
సిలువ క్రింద యేసు రక్తంలో
మంచి పోరాటం పోరాడినారు ||దేవ||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)