1
శాంతి సమాధానాధిపతీ
స్వాంతములో ప్రశాంతనిధీ
శాంతి స్వరూపా, జీవనదీపా
శాంతి సువార్తనిధీ ||సిల్వ||
2
తపములు తరచిన నిన్నె గదా
జపములు గొలిచిన నిన్నెగదా
విఫలులు జేసిన విజ్ఞాపనలకు
సఫలత వీవెగదా ||సిల్వ||
3
మతములు వెదకిన నిన్నె గదా
వ్రతములు గోరిన నిన్నె గదా
పతితులు దేవుని సుతులని నేర్పిన
హితమతి వీవెగదా ||సిల్వ||
4
పలుకులలో నీశాంతి కథ
తొలకరి వానగ గురిసెగదా
మలమల మాడిన మానవ హృదయము
కలకలలాడెకదా ||సిల్వ||
5
కాననతుల్య సమాజములో
హీనత జెందెను మానవత
మానవ మైత్రిని సిల్వపతాకము
దానము జేసెగదా ||సిల్వ||
6
దేవుని బాసిన లోకములో
చావుయె కాపురముండెగదా
దేవునితో సఖ్యంబును జగతికి
యీవి నిడితివి గదా ||సిల్వ||
7
పాపముచేసిన స్త్రీనిగని
పాపులకోపము మండెగదా
దాపునజేరి పాపిని బ్రోచిన
కాపరి వీవెగదా ||సిల్వ||
8
ఖాళీ సమాధిలో మరణమును
ఖైదిగ చేసిన నీవెగదా
ఖలమయుడగు సాతానుని గర్వము
ఖండనమాయెగదా ||సిల్వ||
9
కలువరిలో నీ శాంతి సుధా
సెలయేఱుగ బ్రవహించెగదా
కలుష యెడారిలో కలువలు పూయుట
సిలువ విజయముగదా ||సిల్వ||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)