1
యెహోవాను స్తుతించుడి
ఆయన దయాళుడు
ఆయన కృప నిరంతరముండును
ఆయన కృప నిరంతరముండును (2)
2
దేవ దేవునికి
స్తుతులు చెల్లించుడి ||ఆయన||
3
ప్రభువుల ప్రభువుకు
స్తుతులు చెల్లించుడి ||ఆయన||
4
ఆశ్చర్య కార్యములు
చేయువాని స్తుతించుడి ||ఆయన||
5
ఆకాశము జ్ఞానముచే
జేసినవాని స్తుతించుడి ||ఆయన||
6
నీళ్లమీద భూమిని
పరచినవాని స్తుతించుడి ||ఆయన||
7
గొప్ప జ్యోతులను
నిర్మించినవాని స్తుతించుడి ||ఆయన||
8
పగటినేలు సూర్యుని
చేసినవాని స్తుతించుడి ||ఆయన||
9
రాత్రినేలు చంద్రుని
చేసినవాని స్తుతించుడి ||ఆయన||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)