1
యెరుషలేము గుమ్మములు
కాలిపోతున్నవి
ప్రాకారపు గోడలు కూలిపోతున్నవి
ప్రార్థనాయుధముతో పునరుత్థాన శక్తితో
పునఃనిర్మాణము చేతము రండి ||ఓ||
2
నిరాశ నిస్పృహలే ఎదురు నిలిచినా
నిందలెన్నో మబ్బులుగ మనల కమ్మినా
నిలిచెదం యేసుతో, నడిచెదం దీక్షతో
నిరీక్షణా బలముతో సాగిపోదము ||ఓ||
3
అపవాది బాణములు ఎన్ని విసిరినా
అగ్ని గంధకముల వాన చుట్టుముట్టినా
అదరము, బెదరము,
అరికి మనము వెరవము అన్న
యేసు సన్నిధిలో లేదిక భయము ||ఓ||
4
సంఘమనగా క్రీస్తు యేసు దేహమే కదా
చావునోడించినది ఈ దేహమే కదా
సిలువ తేజస్సుతో, కరుణ మూర్తి
మనసుతో సిరులు విరియు
జీవితాలు నిర్మిద్దాము ||ఓ||
5
యేసే ఈ సంఘమునకు అసలు పునాది
యేసే ఈ జగత్తుకు ఆశాజ్యోతి
యేసే ఆరంభము ఆయనే
అంతము యేసే
మన జీవితాల నవవసంతము ||ఓ||
6
సాక్ష్యమిచ్చె సంఘమే జీవించే సంఘము
జీవించే సంఘమే, సాక్ష్యమిచ్చు
సంఘము
సాక్ష్యము, విశ్వాసము, సఖ్యము,
సహవాసము
సిలువ చలువ పందిరిలో వర్థిల్లాలి||ఓ||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)