1
రారాజు సైన్యమందు జేర-ను
ఆరాజుదివ్యసేవచేయను
యేసురాజు ముందుగా
ధ్వజముబట్టినడువగా
యేసుతో ఠీవిగాను వెడలను ||యేసు||
2
విశ్వాసకవచము ధరించుచు
ఆ రాజునాజ్ఞమదిని నిల్పుచు
అనుదినంబు శక్తిని
బొందుచున్నవారమై
యేసుతో ఠీవిగాను వెడలను ||యేసు||
3
శోధనలు మనలచుట్టివచ్చినా
సాతాను అంబులెల్ని తగిలినా
భయములేదు మనమిక
ప్రభుని చెంత నుందుము
యేసుతో ఠీవిగాను వెడలను ||యేసు||
4
ఓ యువతీ యువకులార జేరుడి
శ్రీ యేసు రాజు వార్త చాటుడి
లోకమంత యేకమై లోకనాథుగెల్వను
సాధనంబెవరు నీవు నేనేగా ||యేసు||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)