1
నీ రక్త ప్రభావమున
నా రోత హృదయంబును
పవిత్రపరచుము తండ్రీ
ప్రతిపాపమును కడిగి ||ప్రియ||
2
అజాగరూకుడనైతి
నిజాశ్రయంబు విడిచి
కరుణారసముతో నాకై
కనిపెట్టితివి తండ్రి ||ప్రియ||
3
వికసించె విశ్వాసంబు
వాక్యంబును చదువగనే
చేరితి నీదు దారి
కోరి నడిపించుము ||ప్రియ||
4
ప్రతి చోట నీ సాక్షిగా
ప్రభువా నేనుండునట్లు
ఆత్మాభిషేకము నిమ్ము
ఆత్మీయరూపుండా ||ప్రియ||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)