1
కరుణతోడ పిల్చియు
స్థిరపరచి కాపాడిన
స్థిరపరచిన నా ప్రభున్‌
పొగడి నే స్తుతింతును ||న||
2
ఎన్నోసార్లు నీ కృపన్‌
విడచియుంటిని ప్రభు (2)
మన్నన తోడ నీదరిన్‌
జేర్చినన్‌ క్షమించితివి ||న||
3
కృంగియుండు వేళలో
పైకి లేవనెత్తితివి (2)
భంగపర్చు సైతానున్‌
గెల్చి విజయమిచ్చితివి ||న||
4
నాకు ఆశ్రయ శైలమై
కోటగా నీవుంటివి (2)
ప్రాకారంపు శైలమై నన్ను
దాచియుంచితివి ||న||
5
సత్యసాక్షివై యుండి
నమ్మదగినవాడవై (2)
నిత్యుడౌ మా దేవుడా
ఆమెన్‌ అంచు పాడెదం ||న||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)