1
నా పాదములను-బండపై నిలిపి
దానిపై నా అడు-గులు స్థిరపరచి
క్రొత్త గీతమును-నా నోట నుంచెను
అనేకులు యెహోవా-యందు
నమ్మెదరు ||నాశన||
2
గర్విష్టుల నబద్ధికు-లను లక్ష్యపెట్టక
యెహోవాను నమ్ముకొనువాడె ధన్యుండు
మా దేవా మా-యెడల నీకున్న
తలంపులు బహు-విస్తారములు ||నాశన||
3
వాటిని వివరింప-నలవి కాదు
నీకు సాటియైన వా-డొకడును లేడు
బలి నైవేద్యము-లను కోరలేదు నీవు
నాకు చెవులను-నిర్మించినావు ||నాశన||
4
దహన బలుల పాప
పరిహార బలులనైనను
నీవు-తెమ్మనలేదు పుస్తకపు చుట్టలో-
నన్ను గూర్చి వ్రాయబడినట్లు నేను
వచ్చియున్నాను ||నాశన||
5
నీ చిత్తమును చేయ-నాకు సంతోషము
నీ ధర్మశాస్త్రము
నా-ఆంతర్యములో నున్నది
మహా సమాజములో
నీ-నీతి సువార్త ప్రకటించి
యున్నా-ననుకొంటిని ||నాశన||
6
నీ నీతిని నా-హృదయములోన
దాచుకొని నే నూర-కుండలేదు
నీ రక్షణ స-త్యమును కృపయును
మహా సమాజమునకు
నేదాచలేదు ||నాశన||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)