1
మరణపు చీకటిలో
తిరుగుచుండినను
ప్రభుయేసునన్ను
కరుణతో ఆదరించున్‌ ||యెహో||
2
పగవారి యెదుట
ప్రేమతో నొక విందు
ప్రభు సిద్ధముచేయున్‌
పరవశమొందెదను ||యెహో||
3
నూనెతో నా తలను
అభిషేకము చేయున్‌
నా హృదయము నిండి
పొర్లుచున్నది ||యెహో||
4
చిరకాలము నేను
ప్రభు మందిరములో
వసియించెద నిరతం
సంతసముగ నుందున్‌ ||యెహో||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)