1
ఘనమైన నీ ప్రేమ - కారణంబున
నీకై - పనిచేయ జేతులివిగో
యనయంబు నీ విషయ - మై
సొగసుగా జురుకు-దనముతో బరుగెత్త్త
వినయ పాదములివిగో ||తనువు||
2
స్వరమిదిగో కొనుమీ - వరరాజ నిను
గూర్చి - నిరతమ్ము పాడనిమ్ము
మరియు పెదవులివిగో
మహనీయమైన నీ-పరిశుద్ధ వార్తతో
బరిపూర్ణముగ నింపు ||తనువు||
3
వెండి పసిడియివిగో - వీసమైనను
నాకై - యుండవలెనని కోరను
నిండైన నీ యిష్ట-నియమంబు చొప్పున
మెండుగ వాడ
బరి-మితియౌజ్ఞానంబిదిగో ||తనువు||
4
నా యిష్ట మిదిగో యిది - నీ
యిష్టముగ జేయ-నా యిష్టమిక గాదది
నా యిచ్ఛ యున్నట్టి నా
హృదయ మిదిగో నీ
కే యియ్యది
రాజ-కీయ సింహాసనమౌ ||తనువు||
5
ఉన్న నా ప్రేమ నీ - సన్నిధానముననే
నెన్నడు ధారవోయన్‌ నన్ను నీ వానిగ
నాథా గైకొను మిపుడు - చెన్నుగ నీ
వశమై స్థిరముగ నుండెద ||తనువు||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)