1
నా శత్రువులు నను చుట్టినను
నరకపు పాశము లరికట్టినను
వరదవలె భక్తిహీనులు పొర్లిన
విడువక నను ఎడబాయనిదేవా ||యె||
2
దయగల వారిపై దయచూపించును
కఠినుల యెడలను వికటము చూపును
గర్విష్టుల యొక్క గర్వము నణచును
సర్వము నెరిగిన సర్వాధికారి ||యె||
3
మరణపు టురులలో మరువక మొరలిడ
ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై
తన యాలయములో నా మొర వినెను
అదరెను ధరణి భయకంపముచే ||యె||
4
పౌరుషము గల ప్రభు కోపింపగ
పర్వతముల పునాదులువణకెను
తన నోట నుండి వచ్చిన యగ్ని
దహించి వేసెను వైరులనెల్ల ||యె||
5
మేఘములపై ఆయన వచ్చును
మేఘములను తన మాటుగ జేయును
ఉరుములు మెరుపులు మెండుగజేసి
అపజయమిచ్చును అపవాదికిని ||యె||
6
నా దీపమును వెలిగించువాడు
నా చీకటిని వెలుగగ జేయును
జలరాసులనుండి బలమైన చేతితో
వెలుపల జేర్చిన బలమైన దేవుడు||యె||
7
నా కాళ్ళను లేడి కాళ్ళగజేసి
ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి
రక్షణ కేడెము నాకందించి
అక్షయముగ తన పక్షము జేర్చిన ||యె||
8
యెహోవా జీవముగల దేవా
బహుగా స్తుతులకు అర్హుడవీవె
అన్య జనులలో ధన్యత జూపుచు
హల్లెలూయ స్తుతి గానము చేసెద ||యె||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)