1
ఆదియు నీవే - అంతము నీవే
జ్యోతియు నీవే-నా శాంతియు నీవే ||ఎ||
2
తల్లి దండ్రియు - దాతవు నీవే
కోటయు నీవే-నా బాటయు నీవే ||ఎ||
3
వ్యాధిలో నీవే - వృద్ధిలో నీవే
బాధలో నీవే - నా సాధకుడవు ||ఎ||
4
రక్షణ నీవే - దీక్షయు నీవే
కాపరి నీవే - నా కర్తవు నీవే ||ఎ||
5
ఆధారం నీవే - ఆనందం నీవే
మోక్షము నీవే - నిరీక్షణ నీవే ||ఎ||
6
దివిలో నీవే - భువిలో నీవే
అపాయములో-సహాయము నీవే ||ఎ||
7
దైవము నీవే - జీవము నీవే
రాజువు నీవే - నా సర్వము నీవే ||ఎ||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)