1
నా చేతులు చేసినట్టి
దోషంబులే గదా
నా రాజు చేతులలో
ఘోరంపు జీలలు ||చూడరే||
2
దురితంపు దలపులే
పరమగురుని శిరముపై
నెనరు లేకమొత్తెనయ్యో
ముండ్ల కిరీటమై ||చూడరే||
3
పరుగెత్తి పాదములు
చేసిన పాపంబులు
పరమరక్షకుని పాదములలో
మేకులు ||చూడరే||
4
పాపేచ్ఛ తోడఁగూడ
నాదు చెడ్డ పడకలే
పరమగురుని ప్రక్కలోని
బల్లెంపు పోట్లు ||చూడరే||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)