1
సిలువలో నీ మేను
నిలచేను మేకులతో
బరువుతో నీ తనువు
ఒరిగెను వేదనతో ||సిలువ||
2
ముండ్లతో ఒక మకుటం
అల్లి నీ తలపై
చిరకతో నీ దాహం
తీర్చెనూ ఈ లోకం ||సిలువ||
3
ప్రక్కలో బల్లెముతో
గ్రక్కునా బొడిచేరా
రక్తమే చిందేనా
శాంతమే మిగిలేనా ||సిలువ||
4
సిలువలో యేసు ప్రభో
శ్రమలలో క్రీస్తు మహా
జాలిలేని నా కోసం
ఏలానో ఈ సహనం ||సిలువ||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)