1
యెహోవనే సేవించుట
అసాధ్యమని తలచిన
ఏ దేవుని నీవు సేవింతువో
ఈనాడే తీర్మానించు
2
దాస్యములో నున్న మనలన్‌
యెహోవ రక్షించెను
గొప్ప సూచనలెన్నో చేసినట్టి
దేవుని సేవింతువా
3
మన త్రోవలో కాపాడుచు
యెహోవ నడిపించెన్‌
దేవుడిచ్చిన యాశీర్వాదం చూచి
కీర్తించి సేవింతువా
4
మేలైనట్టి ఈవులను
దేవాది దేవుడిచ్చెన్‌
ఆయన స్వరంబుకు లోబడి
సాక్షిగా జీవింతువా

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)