1
యేసు చచ్చిన వారిని లేపితివి
మరి కుంటికి కాళ్లను యిచ్చితివి
నేను పాపిని రోగిని నీవే గతి
నాకు దిక్కిక లేదిక వేరెక్కడ ||నా||
2
ప్రభు కుష్ఠును ప్రేమతో ముట్టితివి
మరి దుష్టుల బుద్ధిని మార్చితివి
నాదు పాపపు కుష్ఠును పారద్రోలి
పరిశుభ్రత నీయుము నీవె గతి ||నా||
3
యేసు యాయీరు కుమార్తెను లేపితివి
మరి మృతుడగు లాజరు బ్రతికెనుగా
నేను చచ్చిన పాపిని శరణు ప్రభు
నాకు వేరొక మార్గము లేదికను ||నా||
4
ప్రభు మార్గము ప్రక్కన కూర్చొనిన
ఆ అంధుని ధ్వనిని వింటివిగా
నేను పాపిని అంధుని యేసు ప్రభూ
నను దాటకు దిక్కికలేదు ప్రభూ ||నా||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)