1
గురిలేని నీ బ్రతుకు
ఎరయాయెను విరోధికి
త్వరపడకుంటే నీకు
మరి తప్పదు నరకాగ్ని ||నీ హృ||
2
నీ దేహము దేవునిది
శుద్ధాత్మకు నిలయమది
ప్రభు కర్పణ చేయనిదే
పడగొట్టును అపవాది ||నీ హృ||
3
ప్రభు వనమున పనిచేయ
పనివారలు కావలెను
వినలేవా ప్రభు స్వరము
కనలేవా ప్రభు పొలము ||నీ హృ||
4
దుర్దినములు రాకముందే
స్మరియించుము రక్షకుని
ఘనమైన రక్షణను
నిర్లక్ష్యము చేయుదువా ||నీ హృ||
5
నీ యౌవన కాలమున
ప్రభుకాడిని మోయవలెన్‌
మేలొందెద వీనాడే
జాగేలను యువజనమా ||నీ హృ||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)