1
నన్ను పచ్చిక - గల చోట్ల మేపును
నడిపించును
శాంత - జలముల యొడ్డున ||నా||
2
నా ప్రాణమునకు - సేదను దీర్చును
నడుపును
నీతితో - తన నామమునకై ||నా||
3
గాఢాంధకార - లోయలో
సంచరించినను
భయపడనొల్లనే
యపాయమునకైనను ||నా||
4
నీవు తోడైయుందువు
నీ దుడ్డు కఱ్ఱయు
నీ దండము నన్ను
ఆదరించు నిత్యము ||నా||
5
నా శత్రువుల యెదుట
నాకు భోజనము
ప్రీతితో నీవు సిద్ధ
పరచుచున్నావు ||నా||
6
నూనెతో నా తల - నంటియున్నావు
నా గిన్నెయు నిండి పొర్లి
దిగజారు చున్నది ||నా||
7
నేను బ్రతుకు దినము-లన్నియు కృపా
క్షేమములే నా
వెంటనె వచ్చును ||నా||
8
చిరకాలము యెహోవా
మందిరములో
నే నివాసము జే-సెద హల్లెలూయ ||నా||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)