1
నే తులువనై కడు పాపినై
కఠినాత్మునై-కలుషుండనై
గర్విష్టినై నిను గొట్టగా
దోషుండనై పట్టించితిన్‌ ||కన్నీ||
2
కొరడాలతో కొట్టించితిన్‌
ముళ్ళ కిరీటంబు పెట్టించితిన్‌
నా సిలువనే నీ పై పెట్టించితిన్‌
నడిపించితినా గొల్గొతకు ||కన్నీ||
3
నీ రుధిరమే బహుగా కారెన్‌
నీ రక్తమే స్రవియించగా
నీ దాహమే చేదు చిరకాయెనా
నా పాపమె నీ శిక్షయై ||కన్నీ||
4
నా క్రీస్తువా నీ రక్తము
నను కడిగెను పవిత్రించెను
నే చేరెదా-నీ సిలువకు
నను బ్రోవవే నా రక్షకా ||కన్నీ||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)