1
మనమింక బలహీనులమై యుండగా
సోలి తూలి గాలికి కొట్టుకు పోగా
సిలువలో మన కొరకు బలియాయెను
మనలను బలవంతులుగా మార్చెను
2
మనమింక భక్తి హీనులమై యుండగా
తండ్రి రాజ్యమునకు దూరమవ్వగా
ఆయనె మనల ప్రేమించెను
ప్రాణమునె దానము బలి యిచ్చెను
3
మనమింక పాపులమై బ్రతికి యుండగా
దేవుని ఉగ్రతలో నిలిచి యుండగా
పాపమునకు ప్రాణమును ధారపోసెను
పాపపు రుణము తీర్చి వేసెను

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)