1
పరమ మందిరము ప్రవేశింపగా
తెరచెను మార్గంబు
పరమ శరీరపు తెర తెరచెను గుడి
తెర చినిగె నిజంబు ||జీవో||
2
ధరణియు వణకెను గిరులును గిరగిర
తిరిగి బ్రద్దలాయె
పరమ గురుని మరణ రంగస్థలమున
మరణమె మరణించె ||జీవో||
3
సూర్యుడు అస్త-మించెను నీతి
సూర్యుడస్తమింప
సూర్యోదయమిదె మూడవ దినమున
జూడ రండి వేగ ||జీవో||
4
తొలకరి వాన కాలము గాన
తెలిసికొనుము లెమ్ము
వెలుగును పొందుము-కడవరి వర్షా
కాలమిదే రమ్ము ||జీవో||
5
కడవరి వర్షా కాలము గనుక
కనులు తెరచి చూచి
అడుగుము యేసుని వర్షము కొరకు
బడయు వరకు వేచి ||జీవో||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)