1
లోకులు నిన్ను ద్వేషించినా
లోతైన ప్రేమను పొందెదవా
బంధువులే నిన్ను వెలివేసినా
నిందతో సిలువను మోసెదవా.. నిందతో
నీ కొరకై మరణించితిని
నా కొరకేమి చేసితివి
నీ కొరకై మరణించితిని
నా కొరకేమి చేసితివి
నా కొరకేమి చేసితివి
2
లోక ఘనత వట్టిదని
లోకపు యాస్థి వ్యర్థమని
హృదయమంతటితో నీవు
సేవను చేయ వచ్చెదవా...సేవను
3
కాపరి లేని మంద వలె
పాపపు గడ్డిని మేయుచున్నారు...
కాపరి యేసును ఎరిగి నీవు
ఉన్నత పదవులు వెదకెదవా...ఉన్నత
4
యేసు అంటే ఎవరు యని
అడిగెడివారు ఎంతమందో
ఆకలితోను ఉన్నవారికి
జీవాహారం యిచ్చెదవా?...జీవా

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)