1
అంధకార లోయలోన
సంచరించిన భయము లేదు
నీ వాక్యము శక్తి గలది
నా త్రోవకు నిత్య వెలుగు ||నీ||
2
ఘోరపాపిని నేను తండ్రి
పాప యూబిలో పడియుంటిని
లేవనెత్తుము శుద్ధి చేయుము
పొందనిమ్ము నీదు ప్రేమను ||నీ||
3
ఈ భువిలో రాజు నీవే
నా హృదిలో శాంతి నీవే
కుమ్మరించుము నీదు ఆత్మను
జీవితాంతము సేవ చేసెదన్‌ ||నీ||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)