1
నా హృదయపు వాకిలి తీయమని
పలు దినములు మంచులోనిలచితివి
నీ శిరము వానకు తడిసినను
నన్ను రక్షించుటకు వేచితివి ||నీ||
2
ఓ ప్రియుడా నా అతి సుందరుడా
ధవళ వర్ణుడా నా కతి ప్రియుడా
వ్యసనాక్రాంతుడుగా మార్చబడి
నీ సొగసును నాకు నొసగితివి ||నీ||
3
నీ పరిమళ పుష్ప సుగంధములు
నా రోత హృదయమును నింపినవి
ద్రాక్షారసధారల కన్న మరి
నీ ప్రేమే ఎంతో అతిమధురం ||నీ||
4
ఉన్నత శిఖరములు దాటుచును
ఇదిగో అతడొచ్చుచున్నాడు
నా హృదయపు తలుపులు తెరచుకొని
నా ప్రియుని కొరకు కనిపెట్టెదను ||నీ||
5
నీ విందు శాలకు నడిపించి
రాజులు యాజకులతో జేర్చితివి
జీవాహారము నా కందించి
పరమాగీతములను నేర్పితివి ||నీ||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)