1
స్తుతికి పాత్రుండగు దేవా
సతతము స్తోత్రము లందుమయా
సుదతి మరియ పుత్రుడా
సిలువలోని మిత్రుడా ||కల్వరి||
2
పాపులకై వచ్చినవాడా
ప్రేమా కల్గిన రక్షకుడా
పాదములపై బడితిమి
సిలువలోని మిత్రుడా ||కల్వరి||
3
దీవెనల నిచ్చువాడా
వసుధ కేతెంచిన వాడా
నీవె సుంకరులాప్తుడవు
సిలువలోని మిత్రుడా ||కల్వరి||
4
ఐదు రొట్టెలు మరి రెండు
చేపలతో నైదువేల
జనులను పోషించిన తండ్రి
సిలువలోని మిత్రుడా ||కల్వరి||
5
నీళ్ళను రసముగ మార్చితివి
నీళ్ళ మీద నడిచితివి
మేళ్ళనొసగు మా దాతా
సిలువలోని మిత్రుడా ||కల్వరి||
6
రోగుల బాగు చేయువాడా
గ్రుడ్డికి నేత్రములిచ్చితివి
అనాథుల నాయకుడా
సిలువలోని మిత్రుడా ||కల్వరి||
7
హల్లెలూయ కర్హుడా
ఎల్లరును కొనియాడు వాడా
బలముతో వచ్చు రాజా
సిలువలోని మిత్రుడా ||కల్వరి||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)