1
యెరుషలేము - పిల్లలంత
సంతసించి పాడిరి
వారి పోలె - మేమీనాడు
స్తుతులను - పాడెదం ||హోస||
2
ఆనాడు గాడిద మీద
స్వారి చేసి పోయెను
ఈనాడు నా హృదయ
రాజ్యమును పాలించును ||హోస||
3
పాపము - పరిహరింప
నన్ను నుద్ధరింపను
ప్రేమ మూర్తి - యేసునాథ
పయనమై పోయెను ||హోస||
4
బాలల గీతముల్‌ విని
యేసు సంతసించెను
పాదములన్‌ ముద్దిడి
మే మేసు నారాధింతుము ||హోస||
5
మట్టలాది వారము
ప్రభుని కొనియాడెదం
ఆయన కృప కొరకు
మేము వేడుకొందుము ||హోస||

Temukan kidung nyanyian lainnya dari AG (Aradhana Geethamulu)